నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆగస్టు 21న సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి. పర్వతాలు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని పార్టీ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ హాజరవుతారని పర్వతాలు పేర్కొన్నారు.