ఘనంగా గిరిజన దినోత్సవ వేడుకలు

487చూసినవారు
ఘనంగా గిరిజన దినోత్సవ వేడుకలు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గిరిజన దినోత్సవ వేడుకలు గిరిజన సంఘం నాయకులు హరీష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తండా నాయకులు లక్ష్మణ్ నాయక్ జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్, లక్ష్మణ్ నాయక్, హరీష్ నాయక్ మాట్లాడారు. వారు మాట్లాడుతూ 1994 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి గిరిజన హక్కు చట్టాన్ని కల్పించిందని చెప్పారు. గిరిజన మహిళ రాష్ట్రపతి అయినప్పటికీ గిరిజనులకు ఏ విధమైన సహాయం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు రావలసిన 10 శాతం రిజర్వేషన్ రాకుండా చేస్తున్నాయని విమర్శించారు. అలాగే రిజర్వేషన్ సాధ్యపడదని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించడం ద్రోహం చేయడమే అని చెప్పారు. గిరిజన తండాలకు కోటి రూపాయలు ప్రకటించి గిరిజనులకు అభివృద్ధి చేయాలని కోరారు. రిజర్వేషన్ సాధనకై ఎంతవరకైనా కలిసి పోరాడుతామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాంజ నాయక్, సంగ్య నాయక్, కళ్య దేవేందర్, సేవ్య శ్రీను, రవి మరియ ఇతర తండావాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్