అయిజ మున్సిపాలిటీ పరిధిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణంలో గురువారం ఆర్యవైశ్య సంఘం పట్టణ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ నూతన అధ్యక్షుడు మెతుకు ఓబయ్య శెట్టి, ప్రధాన కార్యదర్శి బచ్చు నాగరాజు, కోశాధికారి మెతుకు భరత్, అలాగే ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం పాలకవర్గ సభ్యులు ప్రమాణం స్వీకరించారు.