మక్తల్: రైతులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

84చూసినవారు
మహబూబ్ నగర్ పట్టణంలో శనివారం జరిగిన రైతు పండుగ బహిరంగ సభకు వేలాదిగా రైతులు తరలి వచ్చి విజయవంతం చేశారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మక్తల్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అశేషంగా హాజరైన రైతుల సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 2,747 కోట్లతో రైతుల రుణాలు మాఫీ చేశారని అన్నారు. రుణ మాఫీతో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్