నారాయణపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రావాలని శనివారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక సెక్రటేరియట్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహను కలిసి ఆహ్వానించారు. జిల్లా ఆస్పత్రి ప్రారంభోత్సవం, మెడికల్ కళాశాల శంకుస్థాపన, నారాయణపేట మండలం బోయినపల్లి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ, నారాయణపేటలో అమృత్ పథకం ప్రారంభోత్సవానికి రావాలని కోరారు.