శ్రీ రామనవమి సందర్భంగా భద్రాద్రి సీతారాములకు ప్రత్యేకంగా బంగారు చీరను సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ నేసారు. పట్టు వస్త్రాలపై భద్రాచలం ఆలయ మూలవిరాట్ రూపాన్ని నెయ్యడంతో పాటు, "శ్రీరామ రామ రామేతి..." శ్లోకాన్ని 51 సార్లు చీరపై చూపించేందుకు పది రోజుల పాటు శ్రమించారు. ఏడు గజాల పొడవు ఉన్న ఈ చీరను ఒక గ్రాము గోల్డ్ జరీతో ప్రత్యేకంగా నేసారు. మొత్తం బరువు 800 గ్రాములు.