గ్రూపు-1 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ

63చూసినవారు
గ్రూపు-1 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ
గ్రూపు-1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 9న జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. జూన్‌ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ పరీక్ష ఉన్నందున గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను మరో తేదీకి మార్చాలని ఎం.గణేశ్, భూక్యా భరత్‌లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్