గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. శ్రీరంగన్ సిటీ–1లో ఉండే హరేష్ కను భాయ్ వాఘేలా అనే వ్యక్తి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ క్రమంలో మనస్థాపం చెంది తన భార్య అషాబెన్, కుమారుడు ధ్రువ్‌లను రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం అతడు చాక్‌తో చేయి కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.