అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జలమండలి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనులు, పెండింగ్ పనులు, వాటి పురోగతిపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. నియోజకవర్గంలో నూతనంగా చేపట్టాల్సిన పనులకు సంభందించిన ప్రతిపాదనలను వెంటనే తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు.