చివరి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం పూర్తయింది. ఈ సమావేశంలో 15 మంది సభ్యుల్లో 11 మంది హాజరయ్యారు. ఈ సమావేశంలో 15 అంశాలు, 6 టేబుల్ ఐటమ్స్ ఆమోదం పొందినట్లుగా శుక్రవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. కమిటీ సభ్యులు అందరూ కలిసి ఆమోదముద్ర వేశారు. క్రీడలు, ఎస్టేట్ అంశాలపై వాడివేడిగా కాసేపు స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది.