పాతబస్తీలో రోడ్డుపై భారీగా నిలిచిపోయిన వర్షపు నీరు

56చూసినవారు
పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలోని పలు ప్రాంతాలు శనివారం ఉదయం కురిసిన వర్షంతో జలమయమయ్యాయి. రోడ్డుపై వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చాంద్రాయణగుట్ట నుంచి అషామాబాద్, బండ్లగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో వర్షపు నీరు భారీ ఎత్తున చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షపు నీటి కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ గంటపాటు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్