ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ప్రాంగణంలో గల నాగదేవతల ఆలయంలో శనివారం ఉదయం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రమణ్య స్వామికి, నాగ దేవతలకు, జంట నాగులకు పాలతో ప్రత్యేక అభిషేకం చేశారు. తదుపరి స్వామి వారిని చందనం, పసుపు, కుంకుమ, పూలమాలతో అలంకరించారు. అనంతరం దీప ధూపాలను వెలిగించి, నైవేద్యాన్ని సమర్పించారు.