పాతబస్తీలోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లేపల్లి వద్ద గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి హోండా సిటీ కారులో ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు. దీంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను ఢీ కొట్టుకుంటూ వెళ్లడంతో వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. అతడిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.