చేప పిల్లల పంపిణీలో అవినీతి జరుగుతోందని సోమవారం అసెంబ్లీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. "మంత్రి సీతక్క, నేను 1. 3 లక్షల చేప పిల్లలను వదిలితే, 80 వేలే వచ్చాయి. కానీ కాంట్రాక్టర్ 8 లక్షలు వదిలినట్లు తప్పుడు లెక్కలు చూపించాడు" అని అన్నారు. అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.