జూబ్లీహిల్స్ లో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాలు. కృష్ణ నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు వెళ్తోన్న క్యాబ్ మెట్రో పిల్లర్ ను బలంగా ఢీ కొట్టింది. ఒక్కసారిగా శబ్దం రావడంతో స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.