ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి, మనాల మోహన్ రెడ్డి, ఎమ్మేల్యేలు రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.