ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హోటల్ లో మీడియాతో మాట్లాడుతూ "ముస్లింలను బీసీల్లో కలిపితే మేము, కేంద్రం ఒప్పుకోదు" అని స్పష్టం చేశారు. హిందూ బీసీల హక్కులు కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.