మోతి దర్వాజా ముఖ ద్వారం వద్ద పూర్తిగా చెత్త మయమైందని పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే ప్రధాన రోడ్డులో చారిత్రాత్మక మోతీ దర్వాజా ఉంది. దీని ముఖద్వారానికి ఎడమ వైపున పూర్తిగా చెత్త చెదారం, పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా తయారైంది. జీహెచ్ఎంసీ సంభందిత అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి చెత్తను, పిచ్చి మొక్కలను క్లియర్ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.