కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి ఠాగూర్ జీవన్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం గుడిమల్కాపూర్ లోని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.