ఎమ్మెల్సీలుగా టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో ఎమ్మెల్సీల నియామకంపై ఎట్టకేలకు వివాదానికి తెరపడింది. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్‌లో వారితో ప్రమాణం చేయించారు.