కూకట్ పల్లి బాగ్ అమీర్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు ఆదివారం కూల్చివేశారు. స్థానికులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. గతంలో నోటీసులు ఇచ్చిన నిర్మాణదారుడు పట్టించుకోకపోవడంతో కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే నిర్మాణదారుడు మాత్రం తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారని చెప్పుకొచ్చారు.