తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేయాలని గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ ముందు SFI నేతల ధర్నా చేపట్టారు. HYDలోని సంధ్య థియేటర్ వద్ద మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. థియేటర్ కు అల్లు అర్జున్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారు.ఈ క్రమంలో రేవతి మృతి చెందగా, ఆమె కుమారుడు స్పృహ తప్పి పడిపోయారు. బాబు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.