మాజీ సీఎం కేసీఆర్ స్ఫూర్తితో కులగణన, 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపడుతామని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కుల, విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలన్నారు.