కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సబ్ స్టేషన్ పక్కన ఉన్న గోధం వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. పాడైపోయిన డెకరేషన్ వస్తువులను డంప్ చేసి గోధాంలో నిల్వ ఉంచడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.