మేడ్చల్ మండల పరిధిలోని బండ మాదారం గ్రామంలో స్కూల్ బస్ బోల్తా కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ పట్టణంలోని చాణిక్య పాఠశాల బస్సు విద్యార్థులను దింపడానికి వెళుతున్న సమయంలో బస్ డ్రైవర్ వేగంగా వెళ్లడంతో బస్సు బోల్తా కొట్టిందని స్థానికులు తెలిపారు. బస్సులోని విద్యార్థులకు గాయాలు కాగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.