కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

52చూసినవారు
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది. వెనుక నుండి టిఎస్ 12 యూఏ 7911 టిప్పర్ లారీ అతివేగంతో స్కూటీపై వెళ్తున్న ఎలెందర్ వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్