కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ శివానగర్ లో 65 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని గత రెండు పర్యాయాలు కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పరచామని, అదే అభివృద్ధిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.