కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి రెజిమెంటల్ బజార్లోని పలు బస్తీలలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేశ్ బుధవారం పర్యటించారు. అనంతరం స్థానికంగా ఉన్న సమస్యలను బస్తీవాసులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, స్ట్రీట్ లైట్ల సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బస్తీల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.