చిలకలగూడ పిఎస్ పరిధిలో ఓ వ్యక్తి హత్య..

83చూసినవారు
సికింద్రాబాద్ చిలకలగూడ పిఎస్ పరిధిలో ఓ వ్యక్తి హత్య సంఘటన చోటుచేసుకుంది. నగేష్ ను కర్రతో కొట్టి హత్య చేసిన స్నేహితుడు నర్సింగ్. తరుణి సూపర్ మార్కెట్ సమీపంలో బుధవారం రాత్రి సమయంలో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో నగేష్ పై కర్రతో దాడి చేసిన నర్సింగ్ అనే వ్యక్తి. మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగినట్లు గుర్తించిన పోలీసులు. నగేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన చిలకలగూడ పోలీసులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్