అధికారులతో కలిసి డివిజన్ లో పర్యటించిన కార్పొరేటర్

82చూసినవారు
సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ శుక్రవారం మహ్మద్ గూడలో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. కలుషిత నీరు వస్తున్నాయని స్థానికులు కార్పొరేటర్ కు పిర్యాదు చేశారు. స్పందించిన ఆమె సమస్య ఎక్కడ ఉందో గుర్తించి పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. రానున్న ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి కొరత ఏర్పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్