స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన సనాతన ధర్మ చరిత్రలో, రామకృష్ణ మిషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న తన జీవితంలోనే తొలిసారిగా ఓ సభను ఉద్దేశించి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో ప్రసంగించారని ఆయన గుర్తు చేశారు. గురువారం మహబూబ్ కాలేజ్ లో వివేకానంద దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు.