సికింద్రాబాద్, ఆర్టీసీ రేతి ఫైల్ బస్టాప్లో డ్రింకింగ్ వాటర్ నల్లాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవిలో నీటి కోసం ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా ఆర్టీసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ప్రయాణికుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. బస్టాప్లలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.