శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులను దృష్టిలో ఉంచుకుని. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు రైళ్లను నడుపుతోంది. ప్రస్తుతం వాటికి అదనంగా మరో 34 అదనపు రైళ్లను, జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1వరకు నడపాలని SCR నిర్ణయించింది. అవి హైదరాబాద్ - కొట్టాయం, కొట్టాయం - సికింద్రాబాద్, మౌలాలి - కొట్టాయం, కాచిగూడ - కొట్టాయం, మౌలాలి - కొల్లం రైల్వే స్టేషన్ల మధ్య సేవలు అందించనున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.