రామంతాపూర్ లోని ఢీమార్ట్ పక్కన కొత్తగా నిర్మిస్తున్న అర్చి( స్వాగత ద్వారం) శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఓ సంఘం అధ్వర్యంలో నిర్మాణం అవుతున్న ముఖద్వారం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో స్థానిక ప్రజలు ఎవరు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.