వెలమ కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఈస్ట్ వెలమ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నాచారంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాచారం పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. తక్షణమే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.