జడేజా విషయంలో నేను నోరు మూసుకోవడమే మంచిది: మంజ్రేకర్

50చూసినవారు
జడేజా విషయంలో నేను నోరు మూసుకోవడమే మంచిది: మంజ్రేకర్
టీ20 ప్రపంచకప్‌లో భారత్ బంగ్లాదేశ్‌ వార్మప్‌ మ్యాచ్‌లో తన్విర్ ఇస్లామ్‌ వేసిన తొలి బంతికి తొలుత జడేజాను ఔట్‌గా భావించిన సంజయ్‌ మంజ్రేకర్ అదే మాటను కామెంట్రీలో వెల్లడించాడు. తీరా జడేజ నాటౌట్‌గా నిలవడంతో.. ‘‘లైన్‌కు లోపల అతడి పాదం లేనట్లుంది. వద్దులే అక్కడ జడేజా బ్యాటింగ్‌లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో నేను నోరు మూసుకుని ఉండటమే బెటర్’ అంటూ తన కామెంట్రీని ఆపేశాడు.

సంబంధిత పోస్ట్