సనాతన ధర్మంలో హోలీ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు.హోలీ రోజు వెండి నాణెం కొని ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ సంవత్సరం హోలీ రోజు లోహంతో చేసిన తాబేలును కొని ఇంటికి తీసుకురావడం శుభప్రదం.హోలీ రోజున ఈ లోహపు తాబేలును ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో సహాయపడుతుంది.