మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కొన్ని అత్యవసర సమయాల్లో నంబర్ టైప్ చేసే పరిస్థితి ఉండదు. కాల్‌లిస్ట్ వెతికే అవకాశం కూడా దొరకదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది షేక్2సేఫ్టీ. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ షేక్ చేసినా, పవర్ బటన్‌ను నాలుగుసార్లు క్లిక్ చేసినా యాప్‌లో ఎంపిక చేసుకున్న నంబర్లకు అలర్ట్ మెసేజ్, ఆడియో ఎమర్జన్సీ నెంబర్లకు వెళ్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంది.