పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు (గురువారం) రెండో టెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఓటమి పాలైన రోహిత్ సేనకు రెండో టెస్ట్ కీలకం కానుంది. బ్యాటింగ్ లో గిల్ రాకతో ఎవరిని తప్పిస్తారనేది ప్రశ్నార్థకం. ఇక సిరాజ్‌పై వేటు వేసి ఆకాశ్ దీప్‌ను తుది జట్టులోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. మ్యాచ్ కు వర్షం ముప్పు లేదు. మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనకబడి ఉంది.