ఐపీఎల్-2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్

13866చూసినవారు
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగోసారి చాంపియన్‌ గా నిలిచింది. కేకేఆర్‌ తో జరిగిన ఫైనల్లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌ 2021 విజేతగా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆరంభంలో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌(50) దూకుడుతో ఇన్నింగ్స్‌ను ఘనంగానే ఆరంభించింది. అయ్యర్‌, గిల్‌(51) ఔటైన తర్వాత మ్యాచ్‌ మొత్తం మారిపోయింది. జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్‌ టర్న్‌ అయింది. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్‌ వికెట్లు కోల్పోతూ ఓటమిపాలైంది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, జడేజా 2, హేజిల్ వుడ్ 2, దీపక్ చాహర్ 1, బ్రావో 1 వికెట్ పడగొట్టారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్‌ డుప్లెసిస్‌ (86) మెరుపులు మెరిపించగా.. మరో ఓపెనర్ రుతురాజ్‌ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్‌ అలీ 20 బంతుల్లో 37 పరుగులు చేయడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 2, శివమ్‌ మావి 1 వికెట్‌ తీశారు.

సంబంధిత పోస్ట్