ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన కోసరి సంధ్య రవి దంపతుల కుమారుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ధర్మారం లయన్స్ క్లబ్ ప్రతినిధులు శుక్రవారం బాలుని ఇంటికి వెళ్లి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ. 16,500 వారికి అందజేశారు. అనంతరం అదే గ్రామంలోని 20 మంది నిరుపేద వ్యక్తులకు దుప్పట్లను పంపి చేశారు. ఈ సందర్భంగా బాలుని కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.