విద్యార్థులు చదువులో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకమని గ్రీన్వుడ్ హై స్కూల్ కరస్పాండెంట్ మిట్టపెల్లి మహేష్ రెడ్డి అన్నారు. సోమవారం రాయికల్ పట్టణ కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమని అన్నారు.