లైంగిక దాడి ప్రతిఘటించిందని ఆరేండ్ల బాలికను హత్య చేసిన ప్రిన్సిపాల్
గుజరాత్‌లోని దహోడ్ జిల్లాలో దారుణం జరిగింది. సింగ్వాడ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ గోవింద్ నాట్ అదే స్కూలుకు చెందిన ఓ బాలిక(6) గొంతు నులిమి హత్య చేశాడు. గురువారం సదరు ప్రిన్సిపాల్ కారులో పాఠశాలకు వస్తుండగా దారిలో బాలికను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. ఆవేశంలో గోవింద్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు.