ఈ ఏడాది 6,000 మంది ఫ్రెషర్స్ కు ఉద్యోగాలు: టెక్ మహీంద్రా

54చూసినవారు
ఈ ఏడాది 6,000 మంది ఫ్రెషర్స్ కు ఉద్యోగాలు: టెక్ మహీంద్రా
డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు టెక్ మహీంద్రా గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి క్వార్టర్లో 1,500 మంది చొప్పున ఈ ఏడాది 6,000 మంది ఫ్రెషర్స్ కు ఉద్యోగాలిస్తామని కంపెనీ సీఈవో మోహిత్ జోషి వెల్లడించారు. గత త్రైమాసికంలో 795 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,45,455కు చేరిందన్నారు. కాగా 2023-24లో సంస్థ నికర ఆదాయం 51 శాతం తగ్గింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్