బాన్సువాడ పట్టణంలోని పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 4న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సన్మాన కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు, నందు పటేల్, పాత బాలకృష్ణ, మంత్రి గణేష్, నాయకులు పాల్గొన్నారు.