కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి పట్టణంలో ఆదివారం కోటగిరి మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొండరాజు, ఉపాధ్యక్షుడిగా యోగేష్, కార్యదర్శిగా సాయికుమార్, కోశాధికారిగా లక్ష్మీ రాజ్, సలహాదారులుగా రమేష్, విజయ్ కుమార్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు పోల విట్టల్, మాశెట్టి నరసయ్య, నరేందర్, అశ్విన్, తదితరులు పాల్గొన్నారు.