ఈనెల 25 నుండి 28వరకు సంగారెడ్డిలో జరిగే సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ గోడప్రతులను సోమవారం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ బిచ్కుందలో అవిష్కరించారు. సంగారెడ్డి జిల్లాలో కేంద్రంలో జరిగే మహాసభలు విజయవంతం చేయాలన్నారు. జుక్కల్ సెగ్మెంట్ పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ మహాసభలకు సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, బీవీ రాఘవులు హాజరవుతున్నారన్నారు.