ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస్ ఖిల్లాను పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ ఖిల్లా (కోట)ను ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతరావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు. కోటలోని ప్రాముఖ్యత కలిగిన ఆనవాళ్లపై మంత్రి ఆరా తీశారు.