మద్నూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ
కామారెడ్డి జిల్లాకు సరిహద్దు ప్రాంతమైన మద్నూర్ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు వద్ద ఎప్పటికప్పుడు పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. శనివారం మద్నూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను ఎస్సై విజయ్ ని అడిగి తెలుసుకున్నారు. చోరీలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని. పేకాట లేకుండా చూడాలన్నారు.