ఘనంగా శ్రీ వీరభద్ర దేవుని కళ్యాణం
మద్నూర్ మండలం కోడిచేర శివారులో వెలిసినటువంటి శ్రీ చెన్నమ్మ కోరి దేవస్థానంలో శ్రీ వీరభద్రుని మందిరంలో శుక్రవారం వైభవంగా శ్రీ వీరభద్ర దేవుని కల్యాణం, గుడి శిఖర పునః ప్రతిష్టాపన జరిగింది. ఉదయం కొడిచేర గ్రామస్తులు శ్రీ వీరభద్ర దేవాలయానికి పాదయాత్రగా వచ్చి దర్శించుకున్నారు. అనంతరం స్వామీజీ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో భక్తులు నడిచి తన భక్తిని చాటుకున్నారు.